న్యాయం దృష్టిలో అందరూ సమానులే అని అర్హులైన వారందరికి ఉచిత న్యాయాధికార సేవ సంస్థ ద్వారా ముద్దాయిలకు సహాయం అందించబడుతుందని టెక్కలి కోర్టు ఫుల్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జె. శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం టెక్కలి మండల కేంద్రంలోని ఆది ఆంధ్ర వీధిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో న్యాయ సేవల లభ్యత, ప్రాథమిక హక్కులు, విధులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.