నందిగాం మండల కేంద్రంలో ఉన్న సామాలమ్మతల్లి ఆలయ హద్దులు నిర్ధారించి తెలియ జేయాలని స్థానికులు తహసీల్దార్ పద్మావతి, ఎస్ఐ మహ్మద్ అమీర్ ఆలీలను కోరారు. ఈ మేరకు శనివారం వినతిపత్రాలు అందించారు. ప్రహరీ నిర్మాణానికి దాతలు సామగ్రి సమకూర్చి నప్పటికీ స్థానికంగా ఒక వ్యక్తి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకుని ప్రహరీ నిర్మాణానికి సహకరించాలని కోరారు.