పలాసలో ఇటీవల లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ బాలికల కుటుంబానికి శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తరపున బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.