పలాస పోలీస్ స్టేషన్లో దాడులకు గురైన వైసీపీ నాయకులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ ను నందిగాం వద్ద సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలి సీఐ శ్రీనివాసరావు, నందిగాం ఎస్సై అలీ సిబ్బందితో నందిగాం సమీపంలో పలాస వెళ్లకుండా అడ్డుకున్నారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించే నైతిక హక్కు కూడా పార్టీ నాయకులకు లేకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.