మందస మండలం కొండలోగాం గ్రామ సమీపాన ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోంపేట ఎక్సైజ్ సీఐ కె బేబీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో సుమారు 1000 లీటర్ల పురిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. నాటుసారా సమూలంగా అరికట్టే దిశగా కృషి చేస్తున్నట్లు సీఐ కె బేబీ తెలిపారు. నాటుసారా తయారీ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.