మందస - హరిపురం రోడ్డు మరమ్మత్తు పనులు గతంలో నాసిరకంగా చేయడంతో పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. ప్యాచ్ వర్క్ చేసిన ప్రదేశాల్లో భారీ వాహనాల రాకపోకలతో మళ్లీ గతుకులు ఏర్పడుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చి రహదారులు బాగు చేస్తారని ఆశపడ్డ ప్రజలు, ప్రయాణికులకు ఈ రోడ్లు పరిస్థితి చూసి కొంత నిరాశ కలుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.