మందస మండలం బైరి సారంగపురం మండల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పలాచారి మాట్లాడుతూ భారత దేశ ప్రథమ ప్రధానమంత్రిగా తన సేవలను అందిస్తూ ఖాళీ సమయంలో బాల బాలికలతో సంతోషంగా గడిపే వారని పిల్లలంటే నెహ్రు కి చాలా ప్రేమ అని అందువలన ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. పిల్లలకు మిఠాయిలు, బహుమతులు అందజేశారు.