ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే బాధ్యత అధికారులపై ఉందని కొత్తూరు ఎంపీపీ సావిత్రి, వైస్ ఎంపీపీ లోతుగెడ్డ తులసి వరప్రసాద్ శనివారం అన్నారు. కొత్తూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వారి పంచాయితీల్లో జరుగుతున్న పనుల వివరాలు తెలియజేయాలని కోరారు.