ఇచ్చాపురం మండల పరిధిలోని 11వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ ఆశి లీలారాణి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా వార్డులోని ప్రతి గడపకు వెళ్లి పార్టీ సభ్యత్వం నమోదు చేశారు. సభ్యత్వ నమోదుతో కలిగే ప్రయోజనాన్ని లీలారాణి వివరించారు. ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.