చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని లావేరు ఏపిఎం మాధవి లత అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేతుల పరిశుభ్రత పై గ్రామ మహిళలకు అవగాహన కల్పించారు. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడంతో అంటురోగాల నుంచి నివారించుకోవచ్చన్నారు.