బూర్జ మండలం అల్లెన గ్రామ సచివాలయంలో శనివారం మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమం జరిగింది. 2014-19 మధ్యకాలంలో మంజూరు అయిన గృహాల బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లుల మంజూరు, వైసీపీ హయాంలో మంజూరు కాబడిన ఇల్లు నిర్మాణం వంటి అంశాలపై ఈ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు వావినిపల్లి రాంజీ, రాంబాబు టంకాల గోవిందరావు హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.