బూర్జ మండలం పెద్దపేట సచివాలయం పరిధిలో పెద్ద పేటలో భూ రీ సర్వే గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల రీ సర్వే పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. బూర్జ రెవిన్యూ పరిధిలో ఉన్న వివిధ భూముల రీ సర్వే సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తాహసిల్దార్ పద్మావతి, ఏపీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ , మాజీ జడ్పిటిసి అనెపు రామకృష్ణ నాయుడు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.