చేనేతల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మంగళవారం పొందూరు మండలంలోని ఓ కళ్యాణ మండపంలో పొందూరు, తోలాపి గ్రామాల క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా చేనేత పరిశ్రమకు సంబంధించిన పరికరాలు పంపిణీ చేశారు. చేనేతల సమస్యలను పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.