తెలగ కులస్తులను బీసీల జాబితాలో చేర్చాలని తెలగ సంఘం ఉత్తరాంధ్ర నాయకుడు పి. వెంకట రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆమదాలవలస పరిధిలో మన్నయ్య పేట ఉద్యాన వనంలో తెలగ కులస్తుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి తెలగ కులస్తులను బీసీల జాబితాలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలగ కులస్తులు పాల్గొన్నారు.