ఐదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని అసత్యాలే మాట్లాడారని ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. గతంలో శాఖలకు కేటాయించిన రూపాయి కూడా ఆ శాఖలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో 2019-22 వరకు కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేదని అన్నారు. ప్రజాప్రతినిధులను మానసిక క్షోభకు గురి చేశారని మండిపడ్డారు.