టెక్కలి మండలం రావివలస గ్రామంలో దేవాదాయశాఖ పరిధిలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జునస్వామి ఆలయం కార్తీకమాస ఉత్సవాలకు ముస్తాబైంది. సోమవారం శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం రూ. 20, రూ. 40 ప్రత్యేక దర్శనాలు కోసం క్యూలైన్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. సీతకోనేరులో రంగుమారిన నీరు ఉండటంతో భక్తులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.