టెక్కలి డివిజన్ ఇన్ఛార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా డా. తాడేల శ్రీకాంత్‌ను నియమిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసిందని డీపీఎం వాన సురేష్ ఆదివారం తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తూ ఇటివల పదవీ విరమణ చేసిన డా. మల్లేశ్వరరావు స్థానంలో ఈయన్ను నియమించారన్నారు. ఫ్యామిలీ డాక్టరు ప్రోగ్రాం (ఎఫ్డీపీ) జిల్లా నోడల్ అధికారిగా డా. శ్రీకాంత్ కొనసాగుతారని చెప్పారు.