ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గొంటి వీధిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వమన్నారు. నూరు రోజుల్లోనే మంచి ప్రభుత్వం అనిపించుకుందన్నారు.