పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు మృతిపట్ల నివాళులర్పించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు వజ్జ బాబురావు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా, సేవకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.