ప్రజా రంజకమైన బడ్జెట్ ను నేడు కూటమి ప్రభుత్వం తీసుకుని రావడం ఎంతో సంతోషకరమైన విషయమని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ బడ్జెట్ పై తనకు మాట్లాడే అవకాశం కనిపించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. రైతులను ఆదుకునే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగిందని, ఇది ఎంతో హర్షదాయకమని ఆమె స్పష్టం చేశారు. రైతులకు అందించే పథకాలు అభినందించవలసిన విషయం అని పేర్కొన్నారు.