ఈ నెల 22న శ్రీకాకుళ సాయుధ పోరాట అమరవీరుల స్మారక సభను మర్రిపాడులో నిర్వహిస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు గోరకల బాలకృష్ణ, పి కుసుమ బుధవారం పలాసలో తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి ఈ స్మారక సభను విజయవంతం చేయాలని వారు కోరారు. అమరవీరులను ఈ స్మారక సభలో స్మరించుకోనున్నట్లు తెలిపారు. వారి స్ఫూర్తితో మనం ముందుకు నడవాలన్నారు.