రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం పలాస నియోజకవర్గంలోని స్థానిక మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డు వద్ద ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు గాను ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గడిచిన 4, 5 నెలలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.