పలాసలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

62பார்த்தது
పలాస లేబర్ కాలనీలో ఉన్న భాగ్యలక్ష్మి పేపర్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది పనులు ముగించుకుని తాళాలు వేసి వెళ్లిన కొంతసేపటికే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాని తెలిపారు.

தொடர்புடைய செய்தி