పల్లె పండుగలో భాగంగా పలాస మండలం చినంచల పంచాయతీ రాజగోపాలపురం గ్రామంలో రూ. 36. 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. కిలోమీటర్ పొడవుతో వేసిన రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలోని మొత్తం ఐదు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.