మందస మండలం బలరాంపురం మండల ప్రాథమిక పాఠశాలలో నవంబర్ 14 స్వతంత్ర భారతదేశ ప్రథమ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలక రోజా మాట్లాడుతూ పిల్లలు అంటే నెహ్రూ కి చాలా ఇష్టమని పిల్లలు భవిష్యత్తులో చక్కని పౌరులుగా తయారు చేయడానికి ఆయన ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు.