జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందని సోంపేట సీఐ మంగరాజు తెలిపారు. ఆదివారం ఈ క్రమంలో స్థానిక ఎస్సై పారినాయుడు తో కలిసి సోంపేట రైల్వే స్టేషన్లో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఒరిస్సా రాష్ట్రం నుండి దిగుమతి వచ్చిన గంజాయి రవాణాను అరికట్టేందుకు గాను ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు.