లావేరు మండలం అదపాక గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గొర్లె అర్జునరావు మాతృమూర్తి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్ సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అదపాక సర్పంచ్ గొర్లె ప్రభాకర్, రణస్థలం మాజీ సర్పంచ్ పిన్నింటి లక్ష్మము నాయుడు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.