ఎచ్చెర్ల: కుప్పిలి గేడ్డపై బీటలు వారిన వంతెనలు

50பார்த்தது
ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం నుంచి కోష్ట వరకు వెళ్లే రోడ్డులో కుప్పిలి గెడ్డపై ఉన్న రెండు వంతెనలు బీటలు వారాయి. గెడ్డ ఉద్ధృతికి పిల్లర్ల వద్ద మట్టి కోతకు గురై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. వంతెనపై ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడల స్తంభాలు చాలా వరకు పెచ్చులు ఊడిపోయాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వంతెనలకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி