ఎచ్చెర్ల మండలం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల నందు ఏపీ ఐసీడీస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఆడపిల్లలకు రక్షణతో పాటు, వారి విద్య, ఆరోగ్య, ఆర్థిక స్వాలాంభనకు కృషి చేయాలని అన్నారు.