బూర్జ మండలం పలు గ్రామాల్లో శిధిల రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ. 64 లక్షల వ్యయంతో ఈ పనులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అప్పటి వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలకే పరిమితమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి జరుగుతుందన్నారు.