ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి మోనింగ్ వారి వీధిలో గల అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలలో అగ్ని ప్రమాదాల నివారణలో జాతీయ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటించాలో అవగాహన కల్పించామని జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారి మారుతి రవికుమార్ పేర్కొన్నారు. డాక్టర్ సురేష్ తో పాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.