భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గంలో గల సరుబుజ్జిలి, పొందూరు, ఆముదాలవలస, బూర్జ మండలాల పరిధిలోవివిధ గ్రామాలలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నాగులచవితి సందడి కనిపించింది. గ్రామశివారు పంటపొలాల వద్ద, చెరువుగట్లు వద్ద గల నాగేంద్రుని పుట్టలవద్ద హిందూ సంప్రదాయం ప్రకారం పాలు, గుడ్లు, నువ్వులు ప్రసాదం తదితర నైవేద్యాలను సమర్పించి పలువురు భక్తులు పూజలు నిర్వహించారు. మందు గుండు సామగ్రి కాల్చారు.