తహశీల్దార్ కార్యాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. మంగళవారం కూడేరు, ఉరవకొండ, వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయానలను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రికార్డ్ రూమ్ లను పరిశుభ్రంగా ఉంచాలని మరియు రికార్డులను క్రమ పద్ధతిలో అమర్చి వాటి యొక్క వివరములు తెలుపు విధంగా సూచన కార్డులను ఏర్పాటు చేయాలన్నారు.