ఉరవకొండ అర్బన్ ఎస్ఐగా జనార్దన్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు రామగిరి నుంచి అమరాపురం బదిలీపై వెళ్లగా అక్కడ 8 నెలలు విధులు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఉరవకొండకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల్లో గతంలో ఎస్ఐగా జనార్దన్ నాయుడు పని చేసిన అనుభవం ఉంది.