తాడిపత్రి పట్టణ పరిశుభ్రతే ధ్యేయమని మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక మునిసిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం చిరు వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని దారులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదన్నారు. చెత్త వేసేందుకు బాక్స్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మునిసిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు.