తాడిపత్రిలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న డివైడర్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై ఎర్రచొక్కా, నీలరంరంగు ప్యాంట్ ఉందని పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడని తెలిపారు. ఎలా చనిపోయాడన్న విషయం తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.