పుట్లూరు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో పలు పంటలు నేలవాలాయి. గాలులతో కూడిన వాన కురవడంతో మొక్కజొన్న, అరటి, చామంతి, తదితర పంటలు నేలకొరిగాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సుమారు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో పంటల్లో నీరు నిలిచింది. అధికారులు నష్టపోయిన రైతులను గుర్తించి నివేదిక తయారు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.