రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అవగాహన సదస్సు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.