బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైవున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. అర్చకులు ఆలయంలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు.