పుట్టపర్తిలోని స్టేట్ బ్యాంక్ రోడ్లో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతోంది. ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం లేదని మంగళవారం స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్త మంగళవారం లోకల్ యాప్ లో ప్రచురితం అయింది. ఈ వార్తపై మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లోకల్ యాప్ కథనానికి కమిషనర్ స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.