టపాసుల విక్రయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెనుకొండ డిఎస్పి వెంకటేశ్వర్లు అమ్మకం దారులనకు తెలిపారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో టపాసుల విక్రయ కేంద్రాలను డిఎస్పీ పరిశీలించారు. అమ్మకం దారులకు తగిన సూచనలు ఇచ్చారు. విద్యుత్ తీగలు అమరకంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట తహసిల్దార్ శ్రీధర్, సిఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.