సోమందేపల్లి మండల కేంద్రంలోని వాల్మీకి సర్కిల్ లో ఉన్న ప్రభుత్వ మద్యం షాపును ఎస్ఐ రమేష్ బాబు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. షాపులో రోజు మద్యం ఎంత అమ్ముతున్నారో? సమస్యలు ఏమైనా ఉన్నాయో అని షాపు మేనేజర్ తో అడిగి తెలుసుకున్నారు. మద్యం తాగి రోడ్లపై పడుకున్న, వ్యాపారస్థులను ఇబ్బంది పెట్టినవారిని ఉపేక్షించమని చెప్పారు. గుడులు, మసీదులు, పాఠశాలల వంటి ప్రదేశాలలో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తామని మందుబాబులకు హెచ్చరించారు.