పిల్లల భవిష్యత్తు కు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలో ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టల్ ను ( రెనోవేషన్ బిల్డింగ్ ) ను మంత్రి ప్రారభించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ పేదరికాన్ని జయించేందుకు ఉన్న ఏకైక మార్గం చదువు ఒకటే అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.