మడకశిర నియోజకవర్గం గౌడనహళ్లి గ్రామ ప్రజలు కొన్ని సంవత్సరాలు నుంచి నీటి కొరతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను మడకశిర నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి శనివారం తన సొంత నిధులతో బోరు వేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ చాలా కాలంగా తాము నీటి సమస్యతో బాధపడుతున్నామని ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.