ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం ఎన్నిక నేపథ్యంలో కూటమి కౌన్సిలర్లు విహారయాత్రకు సోమవారం బయలుదేరి వెళ్ళారు. మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ రాజీనామాతో చైర్మన్ పదవి ఎన్నిక చేయడానికి తెలుగుదేశం, బిజెపి కౌన్సిలర్లు కసరత్తు చేస్తున్నారు. మెజార్టీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉండడంతో టిడిపి తరఫున చైర్మన్ ఎన్నిక కానున్నదని పార్టీ కార్యాలయం వెల్లడించింది.