గుత్తి పట్టణంలోని ఈనెల 6వ తేదీన జరిగే ఛలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని మంగళవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ ఆధ్వర్యంలో.. కళాశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న వసతి దీవెన, విద్య దీవెన రూ. 3, 480 కోట్లు విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతూ చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చామని తెలిపారు.