ధర్మవరం మున్సిపాలిటీ పాఠశాలలో దాదాపుగా 30 సంవత్సరాలకుపైగా పనిచేస్తూ ఉన్న కంటెన్డెంట్ ఆయాలకు కేవలం రూ. 4000 మాత్రమే వేతనాలు ఇవ్వడం హేయమైన చర్య అని సీఐటీయూ మండల కన్వీనర్ జేవీ రమణ శుక్రవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. కనీస వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనంతో పనిచేస్తూ ఆయాలు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.