శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పి ఆర్ టి సర్కిల్ లో గల శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో నూతన నిర్మాణ కట్టడాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త, లయన్స్ క్లబ్ సేవకులు, శ్రీనివాస నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీష్ పది లక్షల రూపాయల విరాళమును ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పాండురంగ స్వామి ఆలయ కమిటీ వారు చెన్నo శెట్టి జగదీష్ ప్రసాద్ కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు.