ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగకు చెందిన మానస జీవన ఉపాధి ఇబ్బందిగా ఉండడంతో రక్త బంధం ఆర్గనైజేషన్ ట్రస్ట్ సభ్యులు కుట్టు మిషన్ ను ఆదివారం ఉచితంగా పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు కిరణ్, చంద్రశేఖర్, ఉదయ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం మానస భర్త ప్రసాద్ ఓ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని, దీంతో ఆ కుటుంబం జీవన ఉపాధి కోల్పోవడంతో, రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు అందరూ కలిసి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.