రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలోని సర్వజన ఆసుపత్రి నందు 27 మంది పిల్లలను పరీక్షించారు. వీరిలో 11 మంది పిల్లలకు సమస్య ఉన్నట్టు గుర్తించారు. రెండు వారాల తర్వాత పరీక్షించి రెటీనా మెచ్యూరిటీ పొందకపోతే ఉచితంగా చికిత్స చేస్తామన్నారు. ముఖ్య అతిథి సీనియర్ సివిల్ జడ్జి శివప్రసాద్ యాదవ్ కంటి రెట్టిన స్క్రీనింగ్ పరీక్షలను సందర్శించారు. డాక్టర్లు, సిబ్బందిని అభినందించారు.